ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానం

ABN, Publish Date - Dec 26 , 2023 | 10:55 PM

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు ప్రభుత్వాలు లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు అలంకార ప్రాయంగా దర్శన మిస్తున్నాయి. గ్రీన్‌ అంబాసిడర్లకు కొన్ని నెలలుగా జీ తాలు చెల్లించక పోవడంతో వారు విఽధులకు దూరంగా ఉండడంతో చెత్త సేకరించేందుకు పంచాయతీలకు కేటాయించిన రిక్షాలు తుప్పుపడుతున్నాయి.

తాళ్లూరు పీహెచ్‌సీ ప్రహరీ వద్ద వేసిన చెత్త ( శివరాంపురంలో అలంకారప్రాయంగా చెత్తసంపద కేంద్రం)

అలంకార ప్రాయంగా చెత్త సంపద కేంద్రాలు

తుప్పుపట్టిన రిక్షాలు 8 పట్టించుకోని అధికారులు

కంపుతో ఇబ్బందిపడుతున్న స్థానికులు

తాళ్లూరు, డిసెంబరు 26 : గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు ప్రభుత్వాలు లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్త సంపద తయారీ కేంద్రాలు అలంకార ప్రాయంగా దర్శన మిస్తున్నాయి. గ్రీన్‌ అంబాసిడర్లకు కొన్ని నెలలుగా జీ తాలు చెల్లించక పోవడంతో వారు విఽధులకు దూరంగా ఉండడంతో చెత్త సేకరించేందుకు పంచాయతీలకు కేటాయించిన రిక్షాలు తుప్పుపడుతున్నాయి. పారిశుధ్య మెరుగునకు చర్యలు చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టీపట్టన ట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన చెత్త సం పద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. చెత్త తయారీ కేంద్రాల కు మరమ్మతులు, మౌలిక వసతులు, ఉన్నతాధికారులు జామ్‌లో సమావేశా లు నిర్వహించి పలుమార్లు సూచించినా ఇంతవరకు వాటిని వినియోగంలోకి తీసుక రాలేదు. మండలంలోని 16 పంచాయతీలందు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతకొంతకాలంగా గ్రామాల్లో రోడ్ల వెంట, చెత్త సంపద తయారీ కేంద్రాల వద్ద చెత్త రాసులుగా నిల్వ ఉంది. తాళ్లూరులోని చెత్త సంపద తయారీ కేంద్రం నామ రూపాలుకూడా కన్పించడం లేదు. మిగిలిన గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు చెత్త సేకరణ నామమాత్రంగా జరుగుతున్నది. ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా పంచాయతీలకు ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు, ఓడీఎస్‌ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రభుత్వ ప్రోత్సాహం పొందేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హరిత రాయబారులకు వేతనాలు చెల్లించక పోవడంతో విధులకు రావడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం లక్షలాదిరూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన చెత్త సంపద తయారీ కేంద్రాల్లో ఒక్క కేంద్రం నుంచి ఎరువు త యారు చేసిన ధాఖలాలు లేవని, అధికారులు నిర్యక్ష్ల్య విధుల వల్ల ప్రభుత్వ నిధులు నిరుపయోగంగా మారాయని పలువురు ఆరోపిస్తున్నారు. చెత్తను గృ హాల నుంచి కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం పంచాయతీలకు చెత్తరిక్షాలను అందజేసింది. చెత్తను వేసేందుకు ప్రతి ఇంటికి రెండుచొప్పున డ బ్బాలు అందజేశారు. గతంలో చెత్తను సేకరించిన హరిత రాయబారులు చెత్త ఎక్కడ వేయాలో తెలియక రోడ్ల వెంబడే పడవేసి వెళుతున్నారు. అన్ని గ్రామాల్లో చెత్త సం పద కేంద్రాలు వినియోగంలో లేక పోవడంతో ప్ర జలు ఎక్కడపడితే అక్కడ చెత్తను, వ్యర్థ పదార్థాలను పడవేస్తుండడంతో గ్రామాల్లో అపరిశుభ్రత నెలకొంది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలు వృథాగా పడి ఉండడం తో అధికారులతీరును ప్రజలు బాహాటంగానే వి మర్శిస్తున్నారు. అధికారులు మాత్రం వీ టిని వినియోగంలోకి తీసుకు రావాలం టే ఖర్చుతో కూడుకున్న పని అన్ని నిధులు లేవని చేతలెత్తేస్తున్నారు. చెత్త తీసుక వెళ్లే రిక్షాలు వాడక పోవడంతో తుప్పుపట్టి పోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం స్పందించి అ లంకార ప్రా యంగా వున్న చెత్త సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకరావాలని, తుప్పుపడుతున్న చెత్త తోలు రిక్షాలు వినియోగంలోకి తీసుకవచ్చి గ్రామాల్లో అపరిశుభ్రత లే కుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising