ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమగ్రశిక్షలో పెన్‌డౌన్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:52 AM

సమగ్రశిక్ష ఉద్యోగుల జిల్లా జేఏసీ పిలుపు మేరకు శనివారం పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు ఈనెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.

టంగుటూరులోని ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల డిమాండ్‌

ఒంగోలు (విద్య), డిసెంబరు 16 : సమగ్రశిక్ష ఉద్యోగుల జిల్లా జేఏసీ పిలుపు మేరకు శనివారం పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు ఈనెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. సన్నాహక చర్యల్లో భాగంగా జిల్లా జేఏసీ శనివారం పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ఎమ్మార్సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది, సీఆర్పీలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌లు అంతా కలిపి జిల్లావ్యాప్తంగా 550మంది పెన్‌డౌన్‌లో పాల్గొన్నట్లు జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణి తెలిపారు. సమగ్రశిక్షలోని కాంట్రాక్టు ఉద్యోగులకు సెప్టెంబరు, అక్టోబరు జీతాలు, కేజీబీవీ డైట్‌ బిల్లులకు నిధులు విడుదల వంటి పలురకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని, గ్రాస్‌పే అమలుచేయాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వం స్పం దించి డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. 18, 19 తేదీల్లో కూడా పెన్‌డౌన్‌ జరుగుతుందని వారు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising