ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీల సమస్యలపై నిర్లక్ష్యమేలా..?

ABN, Publish Date - Dec 26 , 2023 | 10:56 PM

అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు. కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న ఉద్యమాన్ని మంత్రులు, వైసీపీ నాయకులు అవహేళన చేసి మాట్లాడటం సరికాదని హితవుపలికారు.

టంగుటూరులో ప్లేట్లను గరిటెలతో కొడుతున్న అంగన్‌వాడీలు

ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి

ఉద్యమాన్ని వైసీపీ నాయకులు హేళన చేసి మాట్లాడటం సరికాదు

కొండపి ఎమ్మెల్యే స్వామి

మర్రిపూడి, డిసెంబరు 26 : అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి డిమాండ్‌ చేశారు. కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న ఉద్యమాన్ని మంత్రులు, వైసీపీ నాయకులు అవహేళన చేసి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. మర్రిపూడిలో అంగన్‌వాడీలు దీక్ష చేస్తున్న శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వారికి సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కార్యకర్తలు, ఆయాలు సమ్మెకు దిగి 15 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించకపోగా వారిపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కేంద్రాల తలుపులు పగులగొట్టించి పైసాచిక ఆనందం పొందుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడం వల్లనే అంగన్‌వాడీలు, ఆశాలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మెబాట పట్టారన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చడంతోపాటు కార్యకర్తలు, ఆయాలకు ఉద్యోగోన్నతులు కల్పించాలని, తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ఆయన ఆవెంటనే కార్యకర్తలు, ఆయాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యకర్తలు భోజన ప్లేట్లను గరిటలతో కొట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు చేరెడ్డి నర్సారెడ్డి, నాయకులు రేగులు వీరనారాయణ, గొంటు హనుమారెడ్డి, వై.వెంకటరెడ్డి, కె.మోహన్‌రావు, కృష్ణారెడ్డి, ఓబుల్‌రెడ్డి, సీఐటీయు నాయకులు ఎం.రమేష్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ధనలక్ష్మి, కె.నరసమ్మ, సదేష్ణ, హైమావతి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టంగుటూరులో..

టంగుటూరు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మంగళవారం ప్లేట్లపై గరిటలతో కొడుతూ నిరసన తెలిపారు. గౌరవవేతనం మాకొద్దు, కనీస వేతనం ప్రకటించాలంటూ పెద్దపెట్టున నినదించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.రాము, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వి.మోజెస్‌, అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బెల్లం శేషమ్మ, పి.క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

కొండపిలో..

కొండపి : ‘మా జీవితాల్లో చిరునవ్వులు కురిసేలా సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్‌ మనస్సును మర్చు ప్రభువా..’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మంగళవారం కొండపిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

స్థానిక మండల కార్యాలయాల ఎదుట జరిగిన రిలే దీక్ష శిబిరంలో పాల్గొన్న కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఽధ్వజమెత్తారు. ప్లేట్లను గరిటలతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారితో క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేయించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ నాయకుడు కేజీ మస్తాన్‌, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 10:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising