ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నామ్‌ రోడ్డు పేరు మార్పు

ABN, Publish Date - Dec 17 , 2023 | 10:25 PM

ఎప్పుడో పుట్టిన బిడ్డకు పెళ్ళి వయసులో పేరు పెట్టినట్లు నామ్‌ రోడ్డు(నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్లరోడ్డు)కు ఇప్పుడు శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెసస్‌ వేగా బోర్డు ఏర్పాటుచేయటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌-విజయవాడ హైవేని కోల్‌క త్తా-చెన్నై జాతీయ రహదారి ని కలుపుతూ 2010 జూలైలో 212.5 కి.మీ దూరం నామ్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.

మేదరమెట్ల సమీపంలో బొడ్డువానిపాలెం వద్ద ఇటీవల ఏర్పాటుచేసిన శ్రీకాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వే బోర్డు

- దశాబ్ద కాలం తర్వాత మార్చిన వైనం

- శ్రీకాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా బోర్డు ఏర్పాటు

- విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు

అద్దంకి, డిసెంబరు 17: ఎప్పుడో పుట్టిన బిడ్డకు పెళ్ళి వయసులో పేరు పెట్టినట్లు నామ్‌ రోడ్డు(నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్లరోడ్డు)కు ఇప్పుడు శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెసస్‌ వేగా బోర్డు ఏర్పాటుచేయటం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌-విజయవాడ హైవేని కోల్‌క త్తా-చెన్నై జాతీయ రహదారి ని కలుపుతూ 2010 జూలైలో 212.5 కి.మీ దూరం నామ్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. 2014లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. అప్పటినుంచి నామ్‌ రోడ్డు గానే అందరు పిలుస్తున్నారు. కొన్నిచోట్ల కొంతమేర నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వాటి గురించి, ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో నష్టపోయున రైతులకు పరిహారం చెల్లింపు, అద్దంకి పట్టణ పరిధిలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు తదితర అంశాలు అలాగే ఉన్నాయి. వీటిపై కనీసం దృష్టి పెట్టకుండా దశాబ్దకాలం నుంచి వినియోగిస్తున్న రోడ్డును మాజీ సీఎం పేరుతో శ్రీకాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్పు చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

ఈక్రమంలో ఇటీవల మేదరమెట్ల సమీపంలో బొడ్డువానిపాలెం వద్ద శ్రీకాసు బ్రహ్మనందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ వేగా బోర్డు ఏర్పాటుచేశారు. ఈ బోర్డును చూసిన వాహనచోదకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి ఉన్న రోడ్డుకు ఇప్పుడు కొత్త పేరు పెట్టడం ఏమిటా? అని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising