ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ చార్జీల మోతలు.. కరెంట్‌ కోతలు

ABN, First Publish Date - 2023-12-10T23:11:25+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ చార్జీల మోతలు.. కరెంట్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు కరెంట్‌ చార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మండలంలోని మూలగుంటపాడులో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు. గత టీడీపీ హయాంలో విద్యుత్‌రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి లోటు నుంచి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

మూలగుంటపాడులో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నేతలు

ఆపై బిల్లు పెరిగిందంటూ సంక్షేమ పథకాల కోత పెట్టడం జగన్‌కే సాధ్యం

సింగరాయకొండ, డిసెంబరు 10 : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ చార్జీల మోతలు.. కరెంట్‌ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో మూడుసార్లు కరెంట్‌ చార్జీలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మండలంలోని మూలగుంటపాడులో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి మాట్లాడారు. గత టీడీపీ హయాంలో విద్యుత్‌రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి లోటు నుంచి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. గతంలో సోలార్‌ విద్యుత్‌ను యూనిట్‌ రూ. 6 కోనుగోలు చేస్తే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం రూ. 20 కోనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ, పలు చార్జీల పేరిట వైసీపీ ప్రభుత్వ బాదుడు చూసి ఇదేం బాదుడ్రా బాబు అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. విద్యుత్‌ బిల్లును చూస్తేనే వినియోగదారులకు షాక్‌ కొడుతుందని విమర్శించారు. కరెంట్‌ కోతలు, చార్జీల మోతలతో పారిశ్రామిక రంగం పూర్తిగా కుదేలైందన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచి అధికంగా బిల్లులు వస్తున్నాయనే నెపంతో సంక్షేమ పథకాలను నిలిపివేసిన దుర్మార్గ ప్రభుత్వం వైసీపీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్‌ చార్జీలు తగ్గిస్తామని స్వామి హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికీ తిరిగి బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానీబాషా, సన్నెబోయిన శ్రీనివాసులు, కూనపరెడ్డి సుబ్బారావు, పులి ప్రసాద్‌, సుదర్శి చంటి, గుదే వెంకటేశ్వర్లు, చీమకుర్తి శ్రీకాంత్‌, యస్థాని, సనావుల్లా, మోటుపల్లి వెంకటేశ్వర్లు, రావులపల్లి వెంకట్రావు, పసుపులేటి శేషారావు, సన్నెబోయిన శ్రీనివాసులు, మల్లికార్జున, అంబటి శ్రీను, నరాల సుధాకర్‌, తుమ్మా కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising