ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జాతీయ ఉపకార వేతనానికి కొత్త నిబంధన

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:01 PM

జాతీయ స్థాయి ఉపకార వేతనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. ఎంపికైన వారి వివరాలను నేషనల్‌ స్కాలర్‌ షిప్‌ పోర్టర్‌లో నమోదు చేసేందుకు బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ను తప్పని సరిచేసింది.

ఎంపికైన వారిని బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి

జిల్లా, పాఠశాల స్థాయిల్లో నోడల్‌ అధికారులు

ఒంగోలు (విద్య), డిసెంబరు 17 : జాతీయ స్థాయి ఉపకార వేతనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. ఎంపికైన వారి వివరాలను నేషనల్‌ స్కాలర్‌ షిప్‌ పోర్టర్‌లో నమోదు చేసేందుకు బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ను తప్పని సరిచేసింది. దీంతోపాటు మరికొన్ని చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేతనాలను బినామీ పేర్లతో కోట్ల రూపాయాలను కొందరు కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ అధికారిని నియమించింది. ప్రతి పాఠశాలకు ఒక నోడల్‌ ఆఫీసర్‌, పాఠశాలల హెచ్‌ఎంలను బాధ్యులను చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఎన్‌ఎంఎ్‌స ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థుల వివరాలను నేషనల్‌ స్కాలర్‌ షిప్‌ పోర్టర్‌లో నమోదు చేసేందుకు పాఠశాల హెచ్‌ఎం, నోడల్‌ అధికారి.. డీఈవో కార్యాలయంలోని జిల్లా నోడల్‌ అధికారిని సంప్రదించాలి. ఎన్‌ఎ్‌సపీ పోర్టర్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ముందుగా జిల్లా నోడల్‌ అధికారి, తర్వాత పాఠశాల నోడల్‌ అధికారి, పాఠశాల హెచ్‌ఎంలు బయోమెట్రిక్‌ వేస్తేనే అది ఓపెన్‌ అవుతుంది. పాఠశాల హెచ్‌ఎంలు నూతన నిబంధనల ప్రకారం ఎన్‌ఎంఎంఎ్‌స స్కాలర్‌షి్‌పనకు ఎంపికైన విద్యార్థుల వివరాలను ఈనెల 31లోపు పోర్టర్‌లో నమోదు చేయాలని డీఈవో సుబ్బారావు కోరారు.

Updated Date - Dec 17 , 2023 | 11:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising