చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:18 AM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎర్రగొండపాలెం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు.
టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్‌బాబు
పెద్దదోర్నాల, డిసెంబరు 16: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎర్రగొండపాలెం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎరిక్షన్‌బాబుకు సాదర స్వాగతం పలికారు. ఈ క్రమంలో గూడూరి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వైసీపీ అనుసరించిన ప్రజావ్యతిరేకవిధానాలను తెలియ జేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభి వృద్ధి గ్రామాల్లో 90 శాతం సిమెంటు రోడ్ల నిర్మాణం, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, డ్రిప్‌కు రాయితీ, ట్రాక్టర్లు మంజూరు, పంటనష్ట పరి హారం అందజేత, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంటు, నిరుద్యోగభృతి మంజూరు, రుణమాఫీ, నిరంతర విద్యుత్తు సరఫరా, అదుపులో ఉన్న నిత్యావసర వస్తువులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందజేత, కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఆడ బిడ్డకు రూ.1500లు, ఏడాదికి మరో రూ.15 వేలు ఆర్థికసాయం, నిరుద్యోగు లకు 3వేలు భృతి, రైతన్నలకు రూ.20 వేల పెట్టుబడి సాయం, ఇంటింటికీ నీటి కొలాయి ఏర్పాటు వంటి గ్యారంటీ పత్రాలను ప్రజలకు అందజేశారు. తన గెలుపు ద్వారా చంద్రబాబును ముఖ్య మంత్రిని చేసేందుకు ప్రజలు మద్దతు గా నిలవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషా ద్రి, ఈదర మల్లయ్య, షేక్ సమ్మద్ భాష, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్ ఇస్మాయిల్, షేక్ బాష, కటికల శ్రీనివాసులు, చల్లా వెంకటేశ్వర్లు, నాగెళ్ల సత్యనారాయణ, బట్టు సుధాకర్‌రెడ్డి, రావి క్రింది సుబ్బరత్నం, దొడ్డా ప్రదీప్, ఆర్ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 01:18 AM