ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్ర

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:53 AM

మండలంలోని గుదేవారిపాలెం పంచాయతీ పరిధి బూత్‌ నెంబరు 191, 192లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఆన్‌లైన్‌ ద్వారా వందలకొద్దీ ఫాం7 దరఖాస్తులు వచ్చాయి.

ఎన్నికల అధికారులు జారీచేసిన నోటీసు

గుదేవారిపాలెం బూత్‌నెంబరు 191లో 152 ఫాం7లు

దరఖాస్తుదారుని పేరు చోట అదే ఓటరు పేరు!

ఓటర్లకు ఏఈఆర్వో నోటీసులు

20న విచారణ

పీసీపల్లి, డిసెంబరు 16 : మండలంలోని గుదేవారిపాలెం పంచాయతీ పరిధి బూత్‌ నెంబరు 191, 192లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఆన్‌లైన్‌ ద్వారా వందలకొద్దీ ఫాం7 దరఖాస్తులు వచ్చాయి. ఆది నుంచి ఆ పంచాయతీలో టీడీపీకి గట్టిపట్టు ఉంది. గ్రామంలోని 191, 192 బూత్‌లలో టీడీపీ సానుభూతిపరులు అత్యధికంగా ఉన్నారు. అయితే దొంగచాటుగా టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించి వైసీపీ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో భారీగా ఫాం7లు దరఖాస్తు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 191 బూత్‌లో 152, 192బూతులో 21 ఫాం7లు ఆన్‌లైన్‌లో వచ్చాయి. వీటిని పరిశీలించిన ఏఈఆర్వో, బీఎల్వోలు విస్తుపోయే అంశాన్ని గుర్తించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన ఫాం7లలో అప్లికెంట్‌ కాలంలో ఓటర్లే తమ ఓటును తొలగించాలన్న ట్టుగా దరఖాస్తు చేసుకున్నట్లు ఉంది. ఏ ఓటరు అయినా అర్హత కలిగిన తమ కుటుంబసభ్యులకు ఓటుహక్కు కల్పించాలని ఫాం-6 దరఖాస్తు చేస్తారే కానీ తమ ఓటు తొలగించమని ఎందుకు చేసుకుంటారని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అంటున్నారు. ఇదంతా టీడీపీ మద్దతుదార్ల ఓట్లను తొలగించే కుట్రలో భాగంగా కొంతమంది వైసీపీ నాయకులు ఆడిన నాటకమని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో వచ్చిన ఫాం7లపై ఈ నెల 20వ తేదీన స్థానిక పోలింగ్‌ కేంద్రం వద్దే విచారణ చేపట్టేందుకు ఏఈఆర్వో ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఫాం7లు వచ్చిన ప్రతి ఓటరు విచారణకు రావాలంటూ బీఎల్వోల ద్వారా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 12:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising