నేటికీ అందని పరిహారం
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:32 PM
చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మం డలం కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగి మూడేళ్లయిం ది. ఆ ఘర్షణలో వాహనాలు, వలలు, బోట్లు దెబ్బతిన్నాయి. సుమారు 20 మంది గాయపడ్డారు. నష్టం విలువ సుమారు రూ.1 కోటి ఉంటుంద ని ప్రాథమిక అంచనా వేశారు. అందుకు సంబంధించిన పరిహారం నేటికి సదరు బాధితులకు అందలేదు.
వాడరేవు మత్స్యకారుల ఆవేదన
చీరాల, డిసెంబరు 18: చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మం డలం కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగి మూడేళ్లయిం ది. ఆ ఘర్షణలో వాహనాలు, వలలు, బోట్లు దెబ్బతిన్నాయి. సుమారు 20 మంది గాయపడ్డారు. నష్టం విలువ సుమారు రూ.1 కోటి ఉంటుంద ని ప్రాథమిక అంచనా వేశారు. అందుకు సంబంధించిన పరిహారం నేటికి సదరు బాధితులకు అందలేదు. దీంతో మత్స్యకారులు ఆనాటి ఘటనల ను తలుచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైనా నష్టపరిహారం అందించేందుకు పాలకులు, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
2020 నవంబరులో చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండ లం కఠారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య వేటకు సంబంధించి ఉప యోగించే వలల విషయంలో వివాదం నెలకొంది. బల్ల వల, ఐలా వలల విషయంలో నిబంధనలు అతిక్రమించారని ఒకరిపై ఒకరు ఆరోణ లు, ప్రత్యారో పణలు చేసుకున్నారు. ఈక్రమంలో అధికారులు, తీరప్రాం త మత్స్యకార పెద్దల సమక్షంలో జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఈక్రమంలో 2020 డిసెంబరు 11న కఠారివారిపాలెం గ్రామస్థులు వాడరే వుపై దాడిపై చేశారు. ఆ ఘర్షణలో వాడరేవు మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణతో సహా సుమారు 20 మంది గాయపడ్డారు. కొన్ని వాహనాలు, వలలు, బోట్లు ధ్వంసమయ్యాయి. ఈనేపథ్యంలో డిసెంబరు 14న ఎమ్మె ల్యే బలరాం, రాజ్యసభ్యుడు మోపిదేవి వెంకటరమణ తదితరులు చీరాల లోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ ఎ రిపిల్లి రమణను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బలరాం వర్గీ యులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు వాహనాల ను సినీఫక్కీలో నడిపిస్తూ పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆక్రమంలో కొందరు గాయపడ్డారు.
ఇదిలాఉంటే మత్స్యకారుల పెద్దగా ఉండే మోపిదేవి రమణ, ఎమ్మెల్యే బలరాం తదితరులు మత్స్యకారుల మధ్య సయోధ్య పెంచుకోవాలని, అం దుకు తమ వంతు బాధ్యత తీసుకుంటామన్నారు. బోట్లు, వలలు, వాహ నాలు నష్టపోయినవారికి ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని చెప్పా రు. తమకు న్యాయం జరిగి, పరిహారం అందుతుందని మత్స్యకారులు భావించారు. ఆ పరిహారం పరిహాసంగా మారిందని, తమ పెద్దగా భా వించే మోపిదేవి కూడా ఈ విషయంలో తమకు సరైన న్యాయం చేయ లేకపోయారనే భావన ను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆనాడు తమకు ఇచ్చిన హామీల మే రకు పరిహారం అందేవిధంగా తగిన చర్యలు చేపట్టాలని వారు కోరు తున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 10:32 PM