అడవిని తలపిస్తున్న జగనన్న కాలనీలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:31 PM
పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రభుత్వ కార్యక్రమాలేవి జరిగినా అందులో ప్రభుత్వ పెద్దలు స్థానిక ప్ర జాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. జగనన్న కాలనీల పే రుతో అర్హులైన ప్రతి ఒక్కరికీ 1.5 సెంటు చొప్పున ఇంటి స్థలం కేటాయించి ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని అనేక సందర్భాల్లో సాక్షాత్తు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉ పన్యాసాలు, ప్రకటనలు ఇచ్చారు.
ప్లాట్ల అభివృద్ధి పేరుతో మట్టిపాలైన రూ.కోట్లు
లేఅవుట్లు వేసి మూడేళ్లయినా ఇళ్లకు పడని పునాది రాయి
పీసీపల్లి, డిసెంబరు 17 : పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రభుత్వ కార్యక్రమాలేవి జరిగినా అందులో ప్రభుత్వ పెద్దలు స్థానిక ప్ర జాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. జగనన్న కాలనీల పే రుతో అర్హులైన ప్రతి ఒక్కరికీ 1.5 సెంటు చొప్పున ఇంటి స్థలం కేటాయించి ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని అనేక సందర్భాల్లో సాక్షాత్తు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉ పన్యాసాలు, ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి లేఅవుట్లను వేసి ప్లాట్లు కూ డా పెట్టారు. లేఅవుట్ల లెవలింగ్ కోసం ఉపాధి హామీ పథకం నుంచి కోట్లాది రూ పాయలు ఖర్చు కూడా చేశారు. అర్హులైన కొంతమందికి అధికారులు పట్టాలు ఇచ్చా రు. ఇదంతా జరిగి రెండున్నరేళ్లు అవుతన్నా మండలంలో నేటికీ ఒక్క ఇంటికి కూడా పునాదిరాయి పడలేదు. వైసీపీ ప్రభుత్వం వేసిన లేఅవుట్లు చెట్లు, ముళ్లపొదలు పెరిగి అడవులను తలపిస్తున్నాయి. మండలంలో భట్టుపల్లి, వరిమడుగు, చింతగుంపల్లి, రామాపురం, గుం టుపల్లి, లక్ష్మక్కపల్లి, ముద్దపాడు, నేరేడుపల్లి, పెద అలవలపాడు, పెదయిర్లపాడు, పీసీపల్లి, పోతవరం, తలకొండపాడు, వేపగుంపల్లి, మురుగుమ్మి గ్రామాల్లో 749 మంది లబ్ధిదారులను ప్ర భుత్వం గుర్తించింది.వీరికోసం ఆయా గ్రామాల పరిధిలో 30.4ఎకరాలలో రెవెన్యూ శాఖ లేఅవుట్లను వేసింది. అందులో 988 ప్లాట్లు వేసి హద్దురాళ్లు పాతి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. పట్టాలైతే ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుకూ ఇల్లు కట్టించి ఇవ్వలేదు. సొంతంగా ఆ ప్లాట్లలో ఇల్లు నిర్మించుకోవాలన్నా గృహ నిర్మాణ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పట్టాలు ఇచ్చి రెండున్నరేళ్లు దాటినా నేటికీ పునాదిరాయి కూడా పడలేదు.పట్టాలు పొందిన లబ్ధిదారులు తమకు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు చేపడతారని గృహ నిర్మాణశాఖ అధికారిని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఇంతవరకు శాంక్షన్ ఆర్డర్ రాలేదని ఫేస్-2లో అనుమతులు రావచ్చని చెపుతున్నారు.మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పేదల సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఅవుట్లలో మట్టితోలి లెవలింగ్ చేసి అభివృద్ధి చేసేందుకు ఉపాధి పథకంలో సుమారు రూ.2.96కోట్లు ఖర్చు చేశారు. లేఅవుట్లు వేసి రెండున్నర సంవత్సరాలు దాటినా అక్కడ ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో చెట్లు, ముళ్లపొదలు పెరగడంతో లేఅవుట్ల రూపురేకలు మారి అడవిని తలపిస్తున్నాయి.
ఫేస్-2లో అనుమతులు వస్తాయి
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై పీసీపల్లి హౌసింగ్ ఏఈ ఫిరోజ్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఫేస్-1లో పీసీపల్లి మండలం లేదు. ఫేస్-2లో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు శాంక్షన్ ఆర్డర్ వస్తుందని తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం ఉంది.
- ఫిరోజ్, ఏఈ హౌసింగ్
Updated Date - Dec 17 , 2023 | 10:31 PM