ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లారీని ఢీకొట్టిన బొలెరో ట్రక్కు

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:15 AM

: ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీని చెప్పుల లోడుతో వెళుతున్న బొలెరో ట్రక్కు మండలం లోని నికరంపల్లి గ్రామం వద్ద జాతీయ రహ దారిపై ఎదురెదురుగా ఢీకొంది.

మార్కాపురం రూరల్‌, డిసెంబరు 16 : ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీని చెప్పుల లోడుతో వెళుతున్న బొలెరో ట్రక్కు మండలం లోని నికరంపల్లి గ్రామం వద్ద జాతీయ రహ దారిపై ఎదురెదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ శెంచిల్‌కుమార్‌ (40) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి స్వల్పగాయాల య్యాయి. చెప్పుల లోడుతో ఉన్న బొలెరో వాహనం దగ్ధమైంది. పోలీసుల వివరాల మేరకు కర్నూలు నుండి కోల్‌కత్తా కుంటవైపుగా ఉల్లి పాయల లోడుతో లారీ వెళుతోంది. విజయవాడ నుంచి అనంతపురం కంభం వైపునకు చెప్పుల లోడుతో బొలెరో వాహ నం వెళుతోంది. ఈ రెండు వాహనాలు నిక రంపల్లి- దేవరాజుగట్టు మధ్య జాతీయ రహ దారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ తమిళనాడు రాష్ట్రం తురియాపూర్‌కు చెందిన శెంచిల్‌కుమార్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. లారీలో ఉన్న మరో వ్యక్తి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన క్లీనర్‌ సంతోష్‌కు స్వల్పగాయాల య్యాయి. చెప్పుల లోడుతో ఉన్న బొలెరో వాహనం డ్రైవర్‌, మరో వ్యక్తి పారారీలో ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ షేక్‌ నవాజ్‌ అహమ్మద్‌, సీఐ ఆవుల వెంకటేశ్వర్లు, రూరల్‌ ఎస్సై వెంకటేశ్వరనాయక్‌, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:15 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising