అంగన్‌వాడీలపై చిన్నచూపు తగదు
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:01 PM
అంగన్‌వాడీలపట్ల ప్రభుత్వానికి చిన్న చూపు త గదని టీడీపీ మహాశక్తి మహిళలు కరణం అరుణ, షేక్ వాజిదాబేగం అ న్నారు. 15వ రోజు దీక్షల్లో ఉన్న అంగన్‌వాడీలకు మద్దతుగా మంగళవారం టీ డీపీ మహిళలు పాల్గొన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మ హిళలు రోడ్డెక్కితే పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి డిమాండ్లు అడిగితే కక్షపూరిత చర్యలకు ది గుతున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ మహాశక్తి మహిళలు, యూటీఎఫ్ నాయకుల మద్దతు
కనిగిరి, డిసెంబరు 26 : అంగన్‌వాడీలపట్ల ప్రభుత్వానికి చిన్న చూపు త గదని టీడీపీ మహాశక్తి మహిళలు కరణం అరుణ, షేక్ వాజిదాబేగం అ న్నారు. 15వ రోజు దీక్షల్లో ఉన్న అంగన్‌వాడీలకు మద్దతుగా మంగళవారం టీ డీపీ మహిళలు పాల్గొన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మ హిళలు రోడ్డెక్కితే పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు. హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి డిమాండ్లు అడిగితే కక్షపూరిత చర్యలకు ది గుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతోనే అ న్ని వర్గాలు, ఉద్యోగుల సంక్షేమం సాధ్యమౌతుందన్నారు. కార్యక్రమంలో మ హాశక్తి మహిళలు ఫాతిమా, దొరసాని, తులసి, నారాయణమ్మ, వెంకటలక్ష మ్మ, నాగేశ్వరి, లక్ష్మీ, నాగదుర్గ, ధనలక్ష్మీ పాల్గొన్నారు.
యూటీఎఫ్ సాయం
అంగన్‌వాడీల దీక్షలకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనిగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు యూటీఎప్ ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ ఖాజారహంతుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్, కాం ట్రాక్టు ఉద్యోగులు అందరినీ వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించా రు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా పోరాటాలను అణచివేసే ధోరణితో వైసీపీ పాలకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, మాలకొండారెడ్డి, కృష్ణమూర్తి, పోతులూరయ్య, రాము, ఉమా మహేశ్వరి, రమణయ్య పాల్గొన్నారు.
ఆందోళన ఉధృతం
దర్శి : అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 15వ రోజు మంగళవారం కా ర్యకర్తలు, హెల్పర్లు ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్టీల్ పల్లెంపై గరిటెలతో కొ ట్టి వి నూత్న నిరసన తెలిపారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మా ట్లాడుతూ 15 రోజులుగా మహిళలు రోడ్లపై ఆందోళన చేస్తుంటే జగన్‌రెడ్డికి పట్టకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో యూనియన్‌నాయకులు తిరుపతమ్మ, విశ్వవాణి, ప్రశాంతి, మల్లేశ్వరి, మాధవి, వెంకటరమ ణ, దయామణి, చైతన్యభారతి, నాగమణి, బాలమ్మ, సీఐటీయూ నా యకుడు సందు వెంకటేశ్వరరావు, హనుమంతరావు, రంగారావు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:01 PM