ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం తీరుపై అంగన్వాడీల ఆగ్రహం

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:18 AM

నిరవదిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు కూడలిలో రాస్తారోకో, ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు

మార్కాపురం వన్‌టౌన్‌, డిసెంబరు 22: నిరవదిక సమ్మెలో భాగంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక కోర్టు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో విరమింపజేసేందుకు వచ్చిన పోలీసులకు వివిధ వామపక్ష నాయకులకు స్వల్ప వివాదం చోటుచేసుకొంది. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సోమయ్య, రూబెన్‌, సురేష్‌, సీపీఐ నాయకుల అందె నాసరయ్య, కాశీం, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రేణుక, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు : డిమాండ్ల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడిలు శుక్రవారం స్థానిక హైవే రోడ్డుపై నేలపై బైటాయించి రాస్తారోకో చేశారు. ఆ సంఘం అధ్యక్షురాలు స్వర్ణకుమారి మాట్లాడుతూ అంగన్‌ వాడి సమస్యలు పరిష్కరించకుండా తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. శిశు సంక్షేమశాఖ మంత్రి చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆవులయ్య, నర సింహులు, శ్రీనివాసులు, అంగన్‌వాడి వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మున్నా, విజయలక్ష్మి, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కంభం : కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఎఐటియుసి అధ్యక్షులు షేక్‌ మహమ్మద్‌ ఇబ్రహీం, సిఐటియు నాయకులు షేక్‌ అన్వర్‌ మాట్లాడుతతూ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహరి స్తుందన్నారు. ఏఐటీయూసీ అధ్యక్షురాలు సరళ, ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, అంగన్‌వాడిలు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : జీతాలు పెంచాలని సమ్మెలోకి వెళ్ళిన అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ఎర్రగొండపాలెం ప్రధాన కూడలిలో రోడ్డు పై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. హైవే రోడ్డుపై అరగంటపాటు మానవహారం నిర్వహిం చారు. పోలీసులు అక్కడకుచేరుకొని అంగన్వాడీ కార్యకర్తలను తొలగించారు. ప్రదాన కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియూ ఏరియా నాయకులు ఫేక్‌ రఫీ, అమీర్‌బాష, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జి మల్లేశ్వరి, పి సుబాషిణి,నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ,సునీత, తలపాటి సుబ్బమ్మ,సుజాత, పాల్గొని మాట్లాడారు. ఎర్రగొండపాలెం,త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలనుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నాలో పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు జీవీ కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద గత పది రోజులుగా అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహి స్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శిబిరం వద్దే వంట- వార్పు కార్యక్రమం ద్వారా నిరసన తెలిపారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా నటరాజ్‌ కూడలిలో మానవహారం గా ఏర్పడే సమయంలో పోలీసులు అడ్డుక ున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని వెళ్లిపోవాలని ఆక్షేపించారు. దీంతో సీఐటీయూ నాయకులు కొండారెడ్డి, రైతుసంఘం నాయకులు తిరుపతిరెడ్డి, అంగన్వాడీలు వాగ్వివాధానికి దిగారు. శాంతియుతంగా సమస్యలపై నిరసన తెలియజేస్తే మీకు అభ్యంతరమేమిటని ప్రశ్నించారు. అనంతరం కొండారెడ్డి మాట్లాడు తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం మరిచారని, పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవడం అమానుషమన్నారు. ఇప్పటికైనా స్పందించాలన్నారు.ఈ కార్యక్రమం లో కార్యకర్తలు ముంతాజ్‌బేగం, సుబ్బమ్మ, వెంకటలక్ష్మీతదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising