ప్రభుత్వ మార్పు ప్రజలకు అవసరం
ABN, Publish Date - Dec 17 , 2023 | 05:14 AM
‘నీతివంతమైన పాలన రావాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి. అందుకు మనమే సైనికులై పోరాడాలి’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు.
నీతివంతమైన పాలన రావాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి: నాగబాబు
నెల్లూరు, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘నీతివంతమైన పాలన రావాలంటే టీడీపీ-జనసేన కూటమి గెలవాలి. అందుకు మనమే సైనికులై పోరాడాలి’ అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిఽధిలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు, నియోజకవర్గ సమస్యలపై శనివారం నెల్లూరులో ఆయన ఆ పార్టీ శ్రేణులతో సమీక్షించారు. శనివారం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుంది, అభ్యర్థి ఎవరు అనే విషయాలను పక్కనపెట్టి, టీడీపీ-జనసేనల తరఫున ఎవరు నిలబడినా, అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
Updated Date - Dec 17 , 2023 | 05:14 AM