Pawan Kalyan: కాకినాడలో పవన్ పర్యటన.. వైసీపీలో గుబులు
ABN, Publish Date - Dec 30 , 2023 | 07:40 AM
నేడు కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఈ రోజు కూడా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ నియోజక వర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. నిన్నంతా కాకినాడ సిటీకి సంబంధించి 20 వార్డులపై పవన్ సమీక్ష నిర్వహించారు.
కాకినాడ: నేడు కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఈ రోజు కూడా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ నియోజక వర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. నిన్నంతా కాకినాడ సిటీకి సంబంధించి 20 వార్డులపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం కాకినాడ జిల్లా పరిధిలోని టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పవన్ సమావేశం కానున్నారు. నిన్న రాత్రి పవన్‌ను జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు కలవడంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఈ రోజు కూడా ఏమైనా చేరికలు వుంటాయేమోనని వైసీపీలో గుబులు పట్టుకుంది.
Updated Date - Dec 30 , 2023 | 07:40 AM