తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:59 AM
తెలుగు చలనచిత్ర రంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసిన నటుడు ఎన్టీఆర్ అని మాజీ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్థప్రసాద్ అన్నారు.
వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు గ్రంథావిష్కరణలో వక్తలు
రేపల్లె, డిసెంబరు 17: తెలుగు చలనచిత్ర రంగంలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసిన నటుడు ఎన్టీఆర్ అని మాజీ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్థప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఆదివారం సుప్రసిద్థ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు, నటప్రయోక్త ఎన్టీఆర్ కళాపరిషత్ రేపల్లె వ్యవస్థాపకుడు మన్నె శ్రీనివాసరావు రచించిన వెండితెర వేల్పు నందమూరి తారక రామారావు గ్రంథావిష్కరణ నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ సందర్బంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు లాంటి మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. మన్నె శ్రీనివాసరావు ఎంతో కృషిచేసి ఎన్టీఆర్ చరిత్ర పుస్తక రూపంలో రచించటం ఎంతో శుభపరిణామన్నారు. నందమూరి రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల గ్రామమైన నిమ్మకూరులో జన్మించి కృషి పట్టుదలతో దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందిన ఒకే వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 02:59 AM