ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుపై కాదు.. కరువుపై దృష్టి పెట్టు.. జగన

ABN, First Publish Date - 2023-11-05T23:44:12+05:30

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టే విషయంలో జగన చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలో కరువుపై పెడితే మంచిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ సూచించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని సీపీఐ కార్యాలయం బీటీ పక్కీరప్ప భవనలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ

గుంతకల్లు, నవంబరు 5: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టే విషయంలో జగన చూపుతున్న శ్రద్ధ రాష్ట్రంలో కరువుపై పెడితే మంచిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీ జగదీశ సూచించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని సీపీఐ కార్యాలయం బీటీ పక్కీరప్ప భవనలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంటే దానిపై దృష్టిపెట్టి రైతులను ఆదుకోవాల్సిన జగన నిర్లక్ష్యం చేస్తున్నాడన్నారు. చంద్రబాబుపై రెండు రోజులకో కేసు పెట్టే పనిలో సీఎం తలమునకలౌతున్నాడన్నారు. మద్యం, ఉచిత ఇసుక, నీరు-చెట్టు.. ఇలా ఒక్కొక్కటిగా కేసులు పెడుతూ రానున్న ఎన్నికల్లో అక్రమ దారుల్లో గెలవాలని కుయుక్తితో ఉన్నాడన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరువు ఉండగా, కేవలం ఏడు జిల్లాల్లో, 103 మండలాల్లో మాత్రమే కరువు ఉందని ప్రకటించారన్నారు. 80 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే 30 లక్షల ఎకరాల్లో వర్షాభావం కారణంగా అసలు పంటే పెట్టలేదన్నారు. 49 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఇంతటి దారుణమైన దుర్భిక్ష పరిస్థితులు తాండవిస్తోంటే మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం అంశంపై అసలు చర్చించలేదన్నారు. మంత్రి ఉషాశ్రీచరణ్‌ జిల్లాలోని 31 మండలాల్లో కరువు ఉన్నా పట్టించుకోవడంలేదన్నారు. కరువు పరిస్థితుల కారణంగా వలసలు పెరిగిపోయాయన్నారు. వలస వెళ్లిన సత్యసాయి జిల్లా కూలీలు 13 మంది మృత్యువాతపడ్డారన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. ఇంతటి భారీ విపత్తు ఏర్పడినందున జగన కేంద్రం దృష్టికి తీసుకుళ్లి సహాయాన్ని అర్థించాలన్నారు. కరువు జిల్లాలో సీపీఐ రాష్ట్ర నాయకత్వం పర్యటించి కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో సందర్శిస్తారన్నారు. సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు బీ గోవిందు, నియోజవకర్గ కన్వీనరు వీరభద్రస్వామి, నాయకులు గోపీనాథ్‌, రాయల్‌ రాము, ముళీకృష్ణ, వెంకట్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-05T23:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising