టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:09 PM
నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని, కేకు కట్ చేశారు. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పాస్టర్లు ప్రార్థనలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 2
కందుకూరు, డిసెంబరు 18: నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని, కేకు కట్ చేశారు. టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పాస్టర్లు ప్రార్థనలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 220మంది పాస్టర్లకు నాగేశ్వరరావు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవప్రసన్న, గడ్డం జాన్, దామా మల్లేశ్వరరావు, జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహం, చిలకపాటి మధు, ఎన్వీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 10:09 PM