ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

60 శరత్తులు పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2023-11-21T21:27:05+05:30

మండలంలోని సరస్వతీ నగర్‌ వద్ద ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మంగళవారం 60 శరత్తులు (కవితా సంపుటి) పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్‌ రచించిన ఈ పుస్తకాన్ని జాతీయ పరీక్ష సేవా కేంద్రం (భారతీయ భాష సంస్థ, మైసూరు) ప్రతినిధి డాక్టర్‌

21వీకేటీ2 : 60 శరత్తులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ నారాయణరెడ్డి, డాక్టర్‌ పెరుగు రామకృష్ణ తదితరులు

వెంకటాచలం, నవంబరు 21 : మండలంలోని సరస్వతీ నగర్‌ వద్ద ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మంగళవారం 60 శరత్తులు (కవితా సంపుటి) పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్‌ రచించిన ఈ పుస్తకాన్ని జాతీయ పరీక్ష సేవా కేంద్రం (భారతీయ భాష సంస్థ, మైసూరు) ప్రతినిధి డాక్టర్‌ ఎం నారాయణరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ కవి డాక్టర్‌ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ మాడభూషి నిబద్ధత కలిగిన కవి అని, తన అనుభవంలోకి వచ్చిన ప్రతి విషయాన్ని కవిత్వంగా మలిచే సామర్థ్యం కలిగిన ధీశాలి అని పేర్కొన్నారు. డాక్టర్‌ ఎం నారాయణరెడ్డి మాట్లాడుతూ 60 శరత్తులు పుస్తకంలో కవితా శీర్షికలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఝూన్సీ వాణి, డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య, అధ్యయన కేంద్రం సిబ్బంది, పరిశోధకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

--------------------

Updated Date - 2023-11-21T21:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising