ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఎం

ABN, First Publish Date - 2023-12-06T21:59:50+05:30

తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబురావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పేడూరు, నరుకూరు, చింతోపు గ్రామాల్లో మండల సీపీఎం నేత వేగూరి వెంకయ్య ఆధ్వర్యంలో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట పొలాల్లో పర్యటిం

6టీపీజీ 1 : నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న సీపీఎం రాష్ట్ర నాయకులు

తోటపల్లిగూడూరు, డిసెంబరు 6 : తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబురావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పేడూరు, నరుకూరు, చింతోపు గ్రామాల్లో మండల సీపీఎం నేత వేగూరి వెంకయ్య ఆధ్వర్యంలో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట పొలాల్లో పర్యటించి తుఫాన్‌ కారణంగా నీట మునిగిన పొలాల్లో దిగి, ఎంతమేరకు నష్టం జరిగిందో రైతులనడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఉమామహేశ్వరరావు, మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు, ఎస్‌కె.మస్తాన్‌బీ, మారుబోయిన రాజా, వేగూరు శంకరయ్య, నాశిన పరుశురామయ్య తదితరులు పాల్గొన్నారు.

నిమ్మ రైతులను తక్షణమే ఆదుకోవాలి

పొదలకూరు : తుఫాన్‌ తాకిడికి నష్టపోయిన నిమ్మ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ నిమ్మ రైతులను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ విషయమై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. నాలుగు రోజులుగా పార్లపల్లి, చెర్లోపల్లి, బ్రాహ్మణపల్లి, అయ్యగారిపాలెం, చెన్నారెడ్డిపల్లి గ్రామాలతోపాటు మరికొన్ని గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-12-06T22:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising