ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

ABN, Publish Date - Dec 31 , 2023 | 09:27 PM

జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం వారు నవరత్నాలు, నవ మోసాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు బొమ్మి సురేంద్ర, రావూరి రాధాకృష్ణమనాయుడు, గుమ్మడి రాజాయాదవ్‌, స

31వీకేటీ 5 : నవమోసాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న టీడీపీ నేతలు

వెంకటాచలం, డిసెంబరు 31: జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం వారు నవరత్నాలు, నవ మోసాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు బొమ్మి సురేంద్ర, రావూరి రాధాకృష్ణమనాయుడు, గుమ్మడి రాజాయాదవ్‌, సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, మావిళ్లపల్లి శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో 15శాతం కూడా అమలు చేయలేదన్నారు. నవరత్నాలు నవమోసాలుగా మారాయని వారు ధ్వజమెత్తారు.కార్యక్రమంలో నీలం మల్లికార్జునయాదవ్‌, ఈపూరు మునిరెడ్డి, యదనపర్తి శ్యామ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇందుకూరుపేట : నవరత్నాలు నవమోసాలు అయ్యాయని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. మండలంలోని జగదేవిపేటలో ఆదివారం ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రావెళ్ల వీరేంద్రచౌదరి, చెంచుకిషోర్‌ యాదవ్‌, కూకటి వెంకటేశ్వరరెడ్డి, బొల్లినేని హరినాయుడు, బొల్లినేని రవినాయుడు, బోయిపాటి శ్రీనివాసులునాయుడు, సింధూర కృష్ణ, ఈదూరు చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 09:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising