ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

postel vudyala daaran

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:41 PM

ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, జీడీఎస్‌ యూనియన్ల ఆధ్వర్యంలో పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న బట్వాడా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. గురువారం స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద జరిగిన ధర్నాలో కందుకూరు పరి

14కెడికె2 : కందుకూరులో ధర్నా నిర్వహిస్తున్న పోస్టల్‌ బట్వాడా ఉద్యోగులు

కందుకూరు : ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, జీడీఎస్‌ యూనియన్ల ఆధ్వర్యంలో పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న బట్వాడా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. గురువారం స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద జరిగిన ధర్నాలో కందుకూరు పరిసర ప్రాంతాల బట్వాడా ఉద్యోగులతో పాటు ఒంగోలు, చీరాల ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీడీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పీ మాధవరావు, కందుకూరు ప్రాంతీయ నాయకులు టి. నరసింహారావు, పి. వాణిలు మాట్లాడుతూ బట్వాడా ఉద్యోగులను పోస్టల్‌శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ రూ. 5 లక్షలకు పెంచాలని, 180 రోజుల పెయిడ్‌ లీవ్‌లను ఆర్జితసెలవులుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు నిరవధిక సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 10:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising