ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

chandrababu చంద్రబాబు కోసం శత చండీ యాగం

ABN, First Publish Date - 2023-11-06T22:47:33+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ కేసుల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మండలంలోని ఏపినాపిలో భగమాలినీ విద్యా యాగ సహిత శత చండీ రుద్రయాగం ఎఫ్‌సీఐ మాజీ డైరెక్టర్‌ రైతు నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.

వేదపండితుల ఆశీర్వచనాలు పొందుతున్న బొల్లినేని

కలిగిరి, నవంబరు 6: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ కేసుల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మండలంలోని ఏపినాపిలో భగమాలినీ విద్యా యాగ సహిత శత చండీ రుద్రయాగం ఎఫ్‌సీఐ మాజీ డైరెక్టర్‌ రైతు నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని మాట్లాడుతూ 15 మంది రుత్వికులతో శ్రీజ్యోతిరాస్తు విద్యాపీఠం, వైదిక నిర్వహణ బ్రహ్మశ్రీ డాక్టర్‌ మహేశ్వరశర్మ సిద్ధాంతి, నేతృత్వంలో జరుగుతున్న యాగంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటిన నుంచి కక్ష పూరిత పాలన కొనసాగుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాగ ఫలంతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేయడంతోపాటు చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ యాగ కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బిజ్జం కృష్ణారెడ్డి, నాయకులు బొల్లినేని వెంకటసుబ్బయ్య, కృష్ణయ్య, సర్పంచు వరప్రసాద్‌, పూసాల వెంగపనాయుడు, కల్లూరు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T22:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising