kavali జనసేనలో పలువురి చేరిక
ABN, First Publish Date - 2023-11-06T22:45:04+05:30
పట్టణంలోని 29వ వార్డు బాపూజీనగర్‌లో సోమవారం పలువురు వీరమహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.
కావలిటౌన్, నవంబరు 6: పట్టణంలోని 29వ వార్డు బాపూజీనగర్‌లో సోమవారం పలువురు వీరమహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ కావలిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతా్‌పకుమార్‌రెడ్డి చేసిన అభివృద్ధేమీ కనపడలేదని, ఎక్కడ చూసిన గుంతల రోడ్లు అధ్వానపు డ్రైన్లు, గ్రావెల్ దోపిడీ కనపడుతున్నాయన్నారు. అనంతరం జనసేన నాయకుడు ఎస్ రాజేష్ తల్లి తులసి జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు, దివ్యాంగులకు, వృద్ధులకు సుధాకర్ చేతులమీదుగా పండ్లు, మిఠాయిలు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పబ్బా సాయి, జిల్లా కార్యదర్శి సుబ్బయ్య, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాఽథ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-06T22:45:06+05:30 IST