ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కావలి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టి హఠాన్మరణం

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:07 PM

కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు, ఆర్య వైశ్యప్రముఖుడు, మున్సిపల్‌, ఏఎంసీల మాజీ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టి (73) సోమవారం ఉదయం తన నివాసంలో హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మం

18కెవిఎల్‌8: యానాదిశెట్టి(పైల్‌)

పలువురి నివాళి

కావలి,డిసెంబరు18: కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు, ఆర్య వైశ్యప్రముఖుడు, మున్సిపల్‌, ఏఎంసీల మాజీ చైర్మన్‌ గ్రంధి యానాదిశెట్టి (73) సోమవారం ఉదయం తన నివాసంలో హఠాన్మరణం చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మంచంలోనే కుప్పకూలి పోయాడు. వెంటనే ఆయన్ను డాక్టర్‌ రామస్వామి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. మూడు దశాబ్దాలకుపైగా కావలి రాజకీయాలలో ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మాగుంట పర్వతమ్మలకు ప్రియశిష్యుడిగా ఉంటూ కావలి రాజకీయలను ఓ మలుపు తిప్పారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా తానున్నానంటూ ప్రజలకు సేవలందించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన యానాదిశెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి, ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం కావలి పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

పలువురి నివాళి

యానాదిశెట్టి పార్థివ దేహాన్ని పలువురు రాజకీయ, పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, ఆయన సతీమణి శివప్రియ, టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి, పీఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత పసుపులేటి సుధాకర్‌, జనసేన ఇన్‌చార్జి అళహరి సుధాకర్‌, బీజేపీ నాయకుడు జీ. భరత్‌కుమార్‌, పలువురు వామపక్షాల నేతలు తదితరులు ఉన్నారు.

------------

Updated Date - Dec 18 , 2023 | 10:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising