గ్రామ టీడీపీ నేతపై దాడి
ABN, Publish Date - Dec 14 , 2023 | 10:35 PM
వైసీపీ నాయకుడు చుండి మనోహర్‌రెడ్డి తనపై దాడి చేశాడని మండలంలోని రాజుపాళెం టీడీపీ బూత్ కమిటీ ఇన్‌చార్జి తన్నీరు రమేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశా
కలిగిరి, డిసెంబరు 14: వైసీపీ నాయకుడు చుండి మనోహర్‌రెడ్డి తనపై దాడి చేశాడని మండలంలోని రాజుపాళెం టీడీపీ బూత్ కమిటీ ఇన్‌చార్జి తన్నీరు రమేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను అసైన్‌మెంట్ భూమి కొనుగోలు చేశానని, సంబంధిత రైతు వద్దకు వెళ్లి పట్టా ఇవ్వమని కోరగా వైసీపీ నాయకుడు అడ్డుతగిలి పట్టా ఇవ్వకుండా ఆపేశాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. వైసీపీ నాయకుడిని తాను ప్రశ్నించాననే అక్కసుతోనే గురువారం ఉదయం తనను కట్టేసి దాడి చేశాడని తెలిపారు.దీంతో తాను కావలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చానని వివరించారు. ఈ విషయమై ఎస్‌ఐ సంతోష్‌రెడ్డిని వివరణ కోరగా గ్రామంలోకి వెళ్లి విచారించగా కేవలం ఇరువురి మధ్య వాగ్వాదం మాత్రమే జరిగిందని గ్రామస్థులు చెప్పారన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 10:35 PM