AP News: నెల్లూరులో పోలేరమ్మ జాతరకు సర్వం సిద్ధం
ABN, First Publish Date - 2023-10-04T12:02:52+05:30
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది.
ఉమ్మడి నెల్లూరు: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈరోజు (బుధవారం) అర్ధరాత్రి అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర జరుగనుంది. రేపు (గురువారం) ఉదయం నుంచి భక్తజనులకు అమ్మవారి సర్వదర్శనం కలిపించనున్నారు. లక్షలాది భక్తజనులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు మద్యాహ్నం 4 గంటల నుంచి అమ్మవారి విరూపణ శోభాయాత్ర జరుగనుంది. జాతర సందర్భంగా వచ్చే భక్తుల కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రేపు అంగరంగ వైభవంగా పోలేరమ్మ అమ్మవారి జాతర జరగనుంది.
Updated Date - 2023-10-04T12:39:29+05:30 IST