ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలకు నరకం చూపించారు

ABN, First Publish Date - 2023-11-10T22:40:56+05:30

సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో గురువారం కావలిలో జరిగిన సభతో రోడ్లన్సీ మూసివేసి, దుకాణాలు మూయించి కావలి ప్రజలకు వైసీపీ నరకం చూపించిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జీ.భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు.

మాట్లాడుతున్న బీజేపీ నేత భరత్‌కుమార్‌ యాదవ్‌

కావలి, నవంబరు 10: సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో గురువారం కావలిలో జరిగిన సభతో రోడ్లన్సీ మూసివేసి, దుకాణాలు మూయించి కావలి ప్రజలకు వైసీపీ నరకం చూపించిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు జీ.భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లన్నీ మూసివేసి, దుకాణాలు మూయించిన రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవటం దారుణ మన్నారు. కావలి ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నరక యాతన పడటానికి కారకులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సభ పెట్టుకుంటా మంటే అనుమతులు ఇవ్వని పోలీ్‌సలు వైసీపీ సభకు రోడ్డును మూయించి దానిపైనే ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు. ఆ సభలకు ఉపాధి కూలీలకు రెండు మస్టర్లు వేయించి బలవంతంగా తరలించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తుమ్మలపెంట రోడ్డు, ముసునూరు రోడ్లు చూస్తే మీ అభివృద్ధి తెలుస్తోందన్నారు. కావలిలో రౌడీలు తాట తీస్తానని చెప్పే నువ్వు ముందు నీ చుట్టూ ఉన్న రౌడీలను అదుపుచేస్తే నీ మాటలకు అర్థం ఉంటుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T22:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising