ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంబేడ్కర్‌కు ఘన నివాళి

ABN, First Publish Date - 2023-12-06T21:55:53+05:30

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం స్ధానిక దళితకాలనీ సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు నావూరు బుజ్జయ్య, జ్యోతి శివయ్య, కొండమూరి ప్రభుదాసు, దాసు, కొండలరావు నివాళులు అర్పించిన వారిలో ఉన్నా

6 కేవీఆర్‌2: కోవూరు : అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న దళిత సంఘాల నాయకులు

కోవూరు, డిసెంబరు 6 : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా బుధవారం స్ధానిక దళితకాలనీ సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు నావూరు బుజ్జయ్య, జ్యోతి శివయ్య, కొండమూరి ప్రభుదాసు, దాసు, కొండలరావు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి నాయకులు చేజర్ల వేంకటేశ్వర్లురెడ్డి, పంతంగి రామారావు, కలికి సత్యనారాయణరెడ్డి, చల్లా మురళి, ఇంటూరి విజయ్‌, చల్లా సూర్య, పుల్లా యశ్వంత్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తోటపల్లిగూడూరు: మండలంలోని నరుకూరు సెంటర్‌లో ఉన్న జక్కా వెంకయ్య స్మారక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కే ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బాబురావు, మాదాల వెంకటేశ్వర్లు, ఎస్‌కె.మస్తాన్‌బీ, వేగూరు వెంకయ్య, మారుబోయిన రాజా, నాశిన పరుశురామయ్య, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ని అవమానించిన ప్రజా ప్రతినిధులు

విడవలూరు : రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు అవమాన పరిచారని బీఎస్పీ కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాలిరాజు, కన్వీనర్‌ ఎల్లు శ్రీనివాసులు ఆరోపించారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని చౌకిచర్ల గిరిజన కాలనీ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘం నేత పోట్లూరు సుధాకర్‌, స్థానికులు పాల్గొన్నారు.

బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని చెల్లాయపాళెంలో బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత, సర్పంచు ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Updated Date - 2023-12-06T21:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising