Navy Day : నౌకాదళ విన్యాసాలు అదరహో!
ABN, First Publish Date - 2023-12-11T01:16:51+05:30
నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగ ర తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. ఏటా డిసెంబరు 4న విన్యాసాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది మిచౌంగ్ తుఫాన్ కారణంగా 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ
సాగర తీరంలో అట్టహాసంగా నేవీ డే
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్
విశాఖపట్నం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగ ర తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. ఏటా డిసెంబరు 4న విన్యాసాలు నిర్వహిస్తుంటారు. కానీ ఈ ఏడాది మిచౌంగ్ తుఫాన్ కారణంగా 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన విన్యాసాలు సుమారు రెండు గంటలపాటు వీక్షకులను కట్టిపడేశాయి. యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, అధునాతన ఫైటర్ హెలికాప్టర్లతో నేవీ కమాండర్లు చేసిన విన్యాసాలు అదరహో అనిపించాయి. ఎనిమిది వేల అడుగులు ఎత్తు నుంచి పారాచ్యూట్ల సహాయంతో కమాండోలు సాగర తీరంలో దిగిన తీరు అబ్బురపరిచింది. పారాచ్యూట్ బృందానికి నేతృత్వం వహించిన చీఫ్ ప్యాట్రియన్ ఆఫీసర్ శివకుమార్ గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. యూహెచ్‌వీహెచ్ హెలికాప్టర్ల సాయంతో ప్రత్యేక దళాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వీక్షకులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. ఐఎన్‌ఎ్‌స రణ్ విజయ్, ఐఎన్‌ఎ్‌స శివాలిక్, ఐఎన్‌ఎ్‌స ఢిల్లీతోపాటు కిల్తాన్, కవరతీ, కంజర్ యుద్ధ నౌకలపై అత్యవసర పరిస్థితుల్లో నేవీ సిబ్బంది హెలికాప్టర్ల నుంచి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు. నేవీ విన్యాసాలు అతిథులతోపాటు వీక్షకులనూ అలరించాయి. కార్యక్రమంలో తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ రాజేశ్ పెండార్కర్‌తోపాటు అధిక సంఖ్యలో నేవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T01:16:53+05:30 IST