టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేయాలి: నారాయణ
ABN, Publish Date - Dec 24 , 2023 | 03:45 AM
చ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన కలిసి పోటీ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
న్యూఢిల్లీ, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన కలిసి పోటీ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు. శనివారం, తెలంగాణ భవన్‌లో నారాయణ మాట్లాడారు. ‘‘జగన్, చంద్రబాబు, పవన్... ప్రధాని మోదీని చూసి భయపడుతున్నారు. బీజేపీని ఎదిరించే ధైర్యం వీరికి లేదు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే.’’ అని నారాయణ అన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 03:45 AM