ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nadendla : పింఛన్లలో అడ్డగోలు దోపిడీ

ABN, Publish Date - Dec 22 , 2023 | 03:10 AM

జగన్‌ చేస్తున్నది సంక్షేమం కాదని, ముమ్మాటికీ మోసమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల

జగన్‌ది సంక్షేమం కాదు.. మోసం

లెక్కల్లో అదనంగా 10 లక్షల పింఛన్లు

ప్రతినెలా రూ.292 కోట్లు నొక్కేస్తున్నారు

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఆరోపణ

అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జగన్‌ చేస్తున్నది సంక్షేమం కాదని, ముమ్మాటికీ మోసమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సామాజిక పింఛన్లలో జరుగుతున్న అవకతవకలను లెక్కలతో సహా బయటపెట్టారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ఇచ్చే పింఛన్లలోనే నెలకు రూ.292 కోట్లు దోచుకుంటున్నారని, ఏడాదికి రూ.3,513.57 కోట్లు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది నవంబరులో 54,69,161మందికి రూ.2,750 చొప్పున రూ.1503.99 కోట్లు పింఛన్ల కింద ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అదే డిసెంబరులో 54,49,190 మందికి అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ఒక్క నెలలో 19,871 మంది లబ్ధిదారులు తగ్గిపోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేబినెట్‌ అనంతరం 65లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారని, కేబినెట్‌లో మాత్రం 54,69,069 మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చూపించారని, ఈ లెక్కన అర్హత ఉన్నవారిలో 10,64,712మంది లబ్ధిదారులను మోసం చేస్తున్నట్లు మనోహర్‌ చెప్పారు. వీరందరికీ పెన్షన్లు ఇస్తున్నట్లు చూపించి నెలకు దాదాపు రూ.292కోట్లు, ఏడాదికి రూ.3,513.57కోట్లు మింగేస్తున్నారని పేర్కొన్నారు. యువగళం ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 03:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising