AP News: ఏపీలో ఒంటిపూట బడులు.. ఎప్పటివరకంటే...
ABN, First Publish Date - 2023-06-11T17:43:10+05:30
ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే భానుడి భగభగలు ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.
అమరావతి: ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే భానుడి భగభగలు ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మండుతున్న ఎండలు
రాష్ట్రంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. భూ ఉపరితలం నుంచి అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాన్, బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం దిశగా గాలులు వీస్తుండడంతో మొత్తం భూభాగం పొడిగా మారింది. ఇదే సమయంలో ఉత్తరకోస్తాపైకి వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఉదయం నుంచే వేడి వాతావరణం కొనసాగింది. పది గంటల నుంచే వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండలు, గాడ్పులు వీచాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వెనుకంజ వేశారు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా వాతావరణం వేడిగానే ఉంది. రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు కొనసాగడం సాధారణమే అయినా గడచిన వారం రోజుల నుంచి రోజురోజుకూ ఎండలు, వడగాడ్పులు పెరుగుతున్నాయి.
Updated Date - 2023-06-11T17:50:54+05:30 IST