ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు: జడ శ్రావణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2023-03-17T21:10:59+05:30

మ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Results) వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, భవిష్యత్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Results) వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, భవిష్యత్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ (Jada Shravankumar) జోస్యం చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని ఛీ కొట్టారని చెప్పడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమన్నారు. అధికార పార్టీ ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా, ప్రభావితం కాకుండా దైర్యంగా ఓటు వేశారన్నారు. వైనాట్‌ 175 అని విర్రవీగే సీఎం జగన్‌ (CM Jagan) 150 మంది ఎమ్మెల్యేలకు పట్టభద్రుల ఓటర్లు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారన్నారు. పట్టభద్రులు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికి స్పూర్తి అన్నారు. రైతులు, వ్యాపారులు, ప్రజలు కూడా రేపటి ఎన్నికలలో ఛీ కొట్టి జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడుతూ ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని దుయ్యబట్టారు. జూన్‌లో విశాఖకు ఏముఖం పెట్టుకుని వెళతారని ప్రశ్నించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్లకు చెంపపెట్టులాంటిదన్నారు. చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదన్నారు. దళిత బిడ్డను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును శాసనమండలిలో మాట్లాడించడాన్ని తప్పుబట్టారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ 175 స్ధానాల్లో పోటీ చేస్తుందని శ్రావణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-17T21:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising