ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు

ABN, First Publish Date - 2023-11-06T04:58:32+05:30

‘ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. ఎమ్మెల్యేలే అవినీతి చేస్తే ప్రజలు కూడా అవినీతిపరులు అవుతారు’’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

పీఎం, సీఎం పదవులకు నేరుగా ఎన్నికలు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

తిరుమల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. ఎమ్మెల్యేలే అవినీతి చేస్తే ప్రజలు కూడా అవినీతిపరులు అవుతారు’’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానికైనా, ముఖ్యమంత్రికైనా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. డైరెక్ట్‌ ఎలక్షన్స్‌ పెడితే అవినీతి చేసే ఎమ్మెల్యేలు ఉండరు. అప్పుడే దేశంలో అవినీతి తగ్గుతుంది. ప్రత్యక్ష ఎన్నికలంటే నాకు గుర్తువచ్చేది ఇందిరాగాంధీ, ఎన్టీఆరే. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. ఆయన గాలిలో, జగన్మోహన్‌రెడ్డి గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబును ఎలా కొన్నాడో అందరికీ తెలుసు. జగన్‌పై ఎవడు పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు’’ అని నారాయణస్వామి అన్నారు.

Updated Date - 2023-11-06T05:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising