మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
ABN, First Publish Date - 2023-06-05T13:28:09+05:30
దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ రైలు దుర్ఘటన మరువక ముందే దేశంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేడు మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.
విజయవాడ : దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ రైలు దుర్ఘటన(Balasore train tragedy) మరువక ముందే దేశంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నేడు మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు తిరుపతి వెళ్తుండగా బోగీల్లోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపేసి హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం (Prakasam) జిల్లా టంగుటూరు (Tangutur) వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తాజాగా కూడా ఒడిశా(Odisha)లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఒడిశాలో ఓ గూడ్స్ రైలు మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో(Bargarh District) చోటుచేసుకుంది. బర్గర్‌లో సున్నపురాయిని(Limestone) తీసుకెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 5 వ్యాగన్లు(Wagons) పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఏసీసీ సిమెంట్ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
Updated Date - 2023-06-05T13:28:09+05:30 IST