ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెగా డీఎస్సీ ఇంకెప్పుడు?

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:27 AM

ఆడుదాం ఆంధ్రా వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అని డీఎడ్‌..

కర్నూలులో కదంతొక్కిన నిరుద్యోగులు

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 28: ‘ఆడుదాం ఆంధ్రా వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అని డీఎడ్‌.. బీఎడ్‌ అభ్యర్థులు నినదించారు. మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కర్నూలులో నిరుద్యోగులు కదం తొక్కారు. సీఎం డౌన్‌ డౌన్‌, నిరుద్యోగుల ద్రోహి జగన్‌ రెడ్డి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డీఎస్సీ కూడా ప్రకటించలేదని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ కక్షలకు ప్రాధాన్యం ఇస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. మెగా డీఎస్సీ ప్రకటించకపోతే జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా కార్యదర్శి నగేష్‌, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు సీమ కృష్ణ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 03:27 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising