ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జనయాత్ర

ABN, First Publish Date - 2023-12-11T00:23:23+05:30

సమ స్యలు విన్నారు.. పరిష్క రిస్తానని మాటిస్తూ ముందుకు సాగా రు..వినతులు..విన్నపాలతో ఎటు చూసినా జనం.. దారిపొ డ వునా అశేష అభిమానం.. చిరునవ్వుతో అడుగులు వేస్తూ.. అం దరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆదివారం 218వ రోజు లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగింది.ఉదయం 10.35 గంటలకు తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని ఒం టిమామిడి జంక్షన్‌ నుంచి లోకేశ్‌ పాదయాత్ర కొనసాగించారు. అప్పటికే వేలాదిగా జనం లోకేశ్‌తో అడుగులు వేయడానికి సిద్ధమవగా వీరందరినీ పలకరిస్తూ ఫొటోలు దిగుతూ ముం దుకు కదిలారు. ఇంతలో ఒంటిమామిడి జంక్షన్‌ వద్ద మత్స్య కారులు లోకేశ్‌ను కలిసి సమస్యలు వివ రించారు. టీడీపీ అధికారంలోకి రా గానే మత్స్యకారుల సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చారు.

  • దారి పొడవునా జనాభిషేకం

  • సమస్యలు వింటూ ముందుకు

  • నేనున్నానంటూ భరోసా

  • ఉత్సాహంగా యువగళం

  • 3006.7 కి.మీ చేరిన యాత్ర

  • అడుగడుగునా లోకేశ్‌కు నీరాజనం

కాకినాడ,ఆంధ్రజ్యోతి/తుని రూరల్‌: డిసెంబరు 10 : సమ స్యలు విన్నారు.. పరిష్క రిస్తానని మాటిస్తూ ముందుకు సాగా రు..వినతులు..విన్నపాలతో ఎటు చూసినా జనం.. దారిపొ డ వునా అశేష అభిమానం.. చిరునవ్వుతో అడుగులు వేస్తూ.. అం దరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆదివారం 218వ రోజు లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగింది.ఉదయం 10.35 గంటలకు తుని నియోజకవర్గం తొండంగి మండలంలోని ఒం టిమామిడి జంక్షన్‌ నుంచి లోకేశ్‌ పాదయాత్ర కొనసాగించారు. అప్పటికే వేలాదిగా జనం లోకేశ్‌తో అడుగులు వేయడానికి సిద్ధమవగా వీరందరినీ పలకరిస్తూ ఫొటోలు దిగుతూ ముం దుకు కదిలారు. ఇంతలో ఒంటిమామిడి జంక్షన్‌ వద్ద మత్స్య కారులు లోకేశ్‌ను కలిసి సమస్యలు వివ రించారు. టీడీపీ అధికారంలోకి రా గానే మత్స్యకారుల సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చారు. అనం తరం తుఫానుకు నీట మునిగిన వరి పంటలను పరిశీ లిం చారు. పంట నష్టపోయిన కౌలు రైతులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు పరిహారం అం దేలా చట్టాన్ని సవరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర తొండంగి చేరుకోగానే స్థానికులు వివిధ సమస్యలపై వినతులు అందించారు. అనంతరం అంబేడ్కర్‌ సం క్షేమ సేవా సంఘం ప్రతినిధులు, పెరిక వర్గీయులు, టి.తిమ్మా పురం గ్రామస్తులతో భేటీఅయ్యారు. అనంతరం రాత్రి తేట గుంట హైవేపై బసకు చేరుకున్నారు.శృంగవృక్షంలో కాకి నాడ సెజ్‌ బాధిత రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి అర్హులందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను తొలగించేస్తామని ప్రక టించారు.సెజ్‌కు భూములిచ్చిన రైతులకు ఇంకా పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు జాబ్‌కార్డులు ఇచ్చా రని, తీరా ఉద్యోగానికి వెళ్తే దివీస్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులు కొడుతున్నారని ఫిర్యాదు చేశారు. రైతు లకు రూ.75 లక్షల పరిహారం ఇస్తామని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చి మంత్రి దాడిశెట్టి రాజా, సీఎం జగన్‌ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. సెజ్‌ భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న మంత్రి రాజా పేరును మాయా రాజాగా మార్చినట్టు ప్రకటించడంతో రైతులు చప్పట్లు కొట్టారు.

నేడు ముగింపు

లోకేశ్‌ యువగళం పాదయాత్ర సోమవారం సాయంత్రంతో జిల్లాలో ముగియనుంది. సాయంత్రం తుని పట్టణంలోని గొల్లఅప్పారావు సెంటర్‌లో లోకేశ్‌ స్థానికులతో కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశిస్తుంది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ వద్ద దాదాపుగా 55 రోజుల పాటు నిలిచిపోయింది. తిరిగి మళ్లీ గత నెల 27న రాజోలు నుంచి పునఃప్రారంభమైంది. కాకినాడ జిల్లాలో తాళ్లరేవులోకి 29న ప్రవేశించింది. అక్కడి నుంచి కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ నియోజకవర్గాల మీదుగా పిఠాపురంలోకి వచ్చింది. ఈలోపు తుఫాను నేపథ్యంలో భారీవర్షాల కారణంగా ఈనెల 4నుంచి 8 వరకు తాత్కాలిక పాదయాత్రకు బ్రేక్‌ ప్రకటించారు. తిరిగి శనివారం నుంచి యాత్ర ప్రారంభించి జిల్లాలో సోమవారం ముగించనున్నారు.

నేడు పైలాన్‌ ఆవిష్కరణ

లోకేశ్‌ పాదయాత్ర ఆదివారం 3,006.7 కిలోమీటర్లకు చేరుకుంది. ఆదివారం 16.3 కి.మీ పాదయాత్ర చేశారు. 3 వేల కి.మీ పాద యాత్రకు గుర్తుగా 35 అడుగుల ఎత్తయిన పైలాన్‌ను సిద్ధం చేశారు.తేటగుంట హైవేపై యనమల గెస్ట్‌హౌస్‌ వద్ద పైలా న్‌ను సోమవారం లోకేశ్‌ ఆవిష్కరించనున్నారు.

నేడు పాదయాత్ర ఇలా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర 219వ రోజు సోమవారం తుని నియోజకవర్గంలో సాగనుంది. ఉదయం 8 గంటలకు తేట గుంట పంజాబీ దాబా నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.15 గంటలకు తేటగుంట యనమల గెస్ట్‌హౌస్‌ వద్ద యువగళం 3 వేల కిలోమీటర్లు పైలాన్‌ ఆవిష్కరణ. 9.30 గంటలకు ఎర్రకోనేరులోని పద్మనాభ ఫంక్షన్‌ హాల్‌లో డాక్టర్లతో సమావేశం. 11.30కి చామవరం రైల్వేగేటు వద్ద స్థానికులతో మాటామంతీ. 11.45 గంటలకు ఎస్‌.అన్నవరం పరిధి సాయివేదిక వద్ద భోజన విరామం. 2 గంటలకు అదే ప్రాంతంలో కాపు వర్గీయులతో ముఖాముఖి. సాయం త్రం 4 గంటలకు పాదయాత్ర. 4.30 గంటలకు తుని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద స్థానికులతో మాటామం తీ.4.40 గంటలకు తుని ఎన్టీఆర్‌ విగ్రహం సెంటర్‌లో లేబర్‌ యూనియన్‌ ప్రతినిధులతో భేటీ. 4.50 గంటలకు శ్రీరామ థియేటర్‌ వద్ద ఎస్సీ వర్గీయులతో సమావేశం.5.20 గంటలకు తుని గొల్లప్పారావు సెంటర్‌లో స్థానికులతో సమావేశం.5.30 గంటలకు ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటలోకి పాదయాత్ర. 5.50 గంటలకు స్థానికులతో సమావేశం. 6.20 గంటలకు ట్రాన్స్‌ కో కార్యాలయం వద్ద స్థానికులతో మాటామంతీ. 7గంటలకు పీ ఎల్‌ పురం వద్ద యువతతో సమావేశం. 7.30గంటలకు సీతారాంపురంలో స్థానికులతో సమావేశం. 8గంటలకు నామవరం క్యాంపు కేంద్రం వద్ద బస చేయనున్నారు.

Updated Date - 2023-12-11T00:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising