ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోకేశ్‌ పాదయాత్ర.. డిసెంబరు చివరిదాకా! 24న రాజోలులో పునఃప్రారంభం

ABN, First Publish Date - 2023-11-21T05:26:35+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఈ నెల 24న పునఃప్రారంభం కానుంది. ఇది డిసెంబరు చివరి వారం వరకూ జరుగుతుంది.

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఈ నెల 24న పునఃప్రారంభం కానుంది. ఇది డిసెంబరు చివరి వారం వరకూ జరుగుతుంది. యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వలంటీర్లు అందరూ బుధవారం సాయంత్రానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమఅరెస్టు నేపథ్యంలో రాజోలు మండలంలో ఈ యాత్ర ను సెప్టెంబరు 9న లోకేశ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆపిన చోట నుంచే మళ్లీ మొదలుపెట్టడానికి శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పాదయాత్ర కోనసీమ జిల్లా నుంచి వెనక్కి మళ్లి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లనుంది. రాజోలు నుంచి పి.గన్నవరం, అమలాపురం, కొత్త పేట నియోజకవర్గాల మీదుగా తణుకు చేరుతుంది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం చేరి.. విశాఖపట్నం దిశగా సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 3,400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని.. ఆ దూరాన్ని లోకేశ్‌ అధిగమిస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. యా త్ర పూర్తి చేసే సమయానికి ఆయన 3,550 కిమీ నడిచే అవకాశం ఉందని తెలిపాయి.

Updated Date - 2023-11-21T05:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising