ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబు సీఎం కావాలి

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:29 AM

బూటకపు హామీలతో గద్దెనెక్కిన జగన్‌ ప్రజలను మోసపుచ్చుతూనే ఉన్నారని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు.

అహల్యాపురంలో మహిళలతో మాట్లాడుతున్న గౌరు చరిత

పార్నపల్లె మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రచారం

జిల్లా వ్యాప్తంగా బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం

అనుపూరులో గౌరు చరిత ఇంటింటి ప్రచారం

బండిఆత్మకూరు, డిసెంబరు28: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం మండలంలోని పార్నపల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో బుడ్డా, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్‌ ఇంటింటి నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలను ఇంటింటా వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళీధర్‌రెడ్డి, బుల్లెట్‌ రాఘవరెడ్డి, గురుస్వామి, నాగరాజు, నర్ల నాగేశ్వరరెడ్డి, మహేశ్‌, జాకీర్‌, సిద్దయ్య, శంకర్‌, నందయ్య పాల్గొన్నారు.

బూటకపు హామీలతో గద్దెనెక్కిన జగన్‌ : గౌరుచరిత

పాణ్యం : బూటకపు హామీలతో గద్దెనెక్కిన జగన్‌ ప్రజలను మోసపుచ్చుతూనే ఉన్నారని పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అనుపూరు, అహల్యాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా రూ. 13 వేలు ఇస్తానని రూ. 6 వేలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంట నే మద్య నిషేదిస్తానని మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి యేటా నిరుద్యోగులకు 2. 30 లక్షల ఉద్యోగాలు కల్పించి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తానని మొండి చేయి చూపారన్నారు. ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు చేస్తానని పట్టపగలే చుక్కలు చూపించారన్నారు. ఒక వైపు అంగన్‌వాడి, మున్సిపల్‌, ఆశ, వలంటరీలు సమ్మె చేస్తున్నా పండుగలు చేసుకుంటూ తన కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఇల్లు వదలలేదని విమర్శించారు. కార్యక్రమంలో సుదర్శనం, రాజు, తలారి నాయుడు, చాకలి మద్దిలేటి, హుశేన్‌పీర, గణపం జయరామిరెడ్డి,, రాంమోహన్‌నాయుడు, ఈశ్వర్‌రెడ్డి, .రవి, దానం, కొత్తూరు సుబ్బారెడ్డి, మోహన్‌,, శ్రీనివాసరెడ్డి, కేశవ్‌, మద్దూరు సుధాకర్‌, హనుమంతు, రాజేష్‌, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

నందికొట్కూరు రూరల్‌ : వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు దేవెళ్ల మురళి, మండల కన్వీనర్‌ కాతా రమేష్‌ రెడ్డి అన్నారు. మిడుతూరు మండల కేంద్రంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మిడుతూరులో జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మెకు దేవెల్ల మురళి, కాతా రమేష్‌ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ప్రమోద్‌ రెడ్డి, వెంకటేశ్వరెడ్డి, విష్ణువర్దన్‌ రెడ్డి పాల్గొన్నారు.

జగన్‌ రాష్ట్రానికి ఎందుకో అవసరమో చెప్పాలి

కొత్తపల్లి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి ఎందుకవసరమో వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య, టీడీపీ మండల కన్వీనర్‌ నారపురెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి లింగస్వామి గౌడు అన్నారు. కొక్కెరంచ గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. నాయకులు సురేంద్రనాథ్‌ రెడ్డి, బూత్‌ ఇన్‌చార్జిలు చిన్నస్వామి, లక్ష్మణగౌడు, నాయకులు లింగస్వామి, రమణారెడ్డి, జమీర్‌, అంజి, బాబు, సుమన్‌, మధు, నాగశేషులు, రామకృష్ణ పాల్గొన్నారు.

మూడు నెలల్లో జగన్‌ ఇంటికి

పాములపాడు: మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జయసూర్య అన్నారు. బానకచెర్ల గ్రామంలో టీడీపీ మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాధ్‌రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, జనార్దన్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, నాయకులు గోవిందు, బండ్లమూరి వెంకటేశ్వరరావు, గజ్జల బాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising