ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంచాయతీ వ్యవస్థను కాపాడుకుందాం: వైవీబీ

ABN, First Publish Date - 2023-11-30T03:38:12+05:30

గ్రామ స్వరాజ్యానికి కారణమైన పంచాయతీ వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దానిని కాపాడుకుని పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గ్రామ స్వరాజ్యానికి కారణమైన పంచాయతీ వ్యవస్థను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దానిని కాపాడుకుని పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. బుధవారం ఏపీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు లక్ష్మీ ముత్యాలరావుతో కలిపి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను, అధికారాలను హైజాక్‌ చేసిందని, ఈ నిరంకుశ పాలన ప్రారంభమయ్యాక 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని, మనం ఇంకా ఉపేక్షిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని తెలిపారు. ఇకనైనా సర్పంచ్‌లందరూ పార్టీలకతీతంగా ప్రభుత్వాన్ని నిలదీద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-30T03:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising