ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:46 PM

అధికారంలోకి రాక ముందు యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందో చూపాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విఘ్ను కృష్ణన్‌ ప్రశ్నించారు.

రైతుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వాలు

ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విఘ్ను కృష్ణన్‌

కర్నూలు(న్యూసిటీ) డిసెంబరు 17: అధికారంలోకి రాక ముందు యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందో చూపాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విఘ్ను కృష్ణన్‌ ప్రశ్నించారు. నగరంలో మూడు రోజులు పాటు జరిగిన ఏఐకేఎస్‌ జాతీయ సమావేశాలు ఆదివారం ముగిసాయి. సత్యఇన్‌ రెసిడెన్సిలో జరిగిన ఈ సమావేశాలకు 26 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విఘ్ను కృష్ణన్‌ మాట్లాడుతూ దేశంలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారన్నారు. రైతులు రుణమాఫీ చేస్తామని, యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే వాగ్దానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. దేశంలో లక్ష మంది పైనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరో మూడు లక్షల మంది కార్మికులు, 50 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితిని దేశంలో చూడాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపైన సంవత్సరంపాటు ఢిల్లీలో రైతు మహా ఉద్యమాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా అధ్వర్యంలో నడిపామన్నారు. ఉద్యమ సమయంలో 750 మంది రైతులు చనిపోయారని, లికంపూర్‌ కేరీలో ఐదుగురు రైతులను, ఒక విలేకరిని మంత్రి కుమారుడు కారుతో గుద్ది చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రైతుల పంటలకు పెట్టిన ఉత్పత్తి ఖర్చు కూడా ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అనంతరం జాతీయ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్ల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 68 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల కారణంగా వ్యవసాయం సంక్షోభంలోపడి నలిగిపోతున్నదని అన్నారు. ఆదానీ, అంబానీలకు ఏజెంట్‌గా మారిన మోదీ ప్రభుత్వం రూ.50 లక్షల కోట్లను కేవలం వంద కుటుంబాలకు దోచి పెడుతున్నదన్నారు. మోదీ హటావో దేశ్‌కి బచావో అనే నినాదంతో గ్రామస్థాయి నుంచి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు తీగల సాగర్‌, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising