వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:50 AM
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెబుతామని అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, వరలక్ష్మి, సరోజ, జానకీ హెచ్చరించారు.
18వ రోజుకు చేరిన అంగన్‌వాడీల సమ్మె
ఆదోని, డిసెంబరు 29: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెబుతామని అంగన్‌వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, వరలక్ష్మి, సరోజ, జానకీ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం దగ్గర చేపట్టిన సమ్మె 18వ రోజు చేరుకుంది. దీక్షలో అంగన్‌వాడీ కార్యకర్తలు రేణుక, పద్మ, మీనాకుమారి, రిజ్వానా, సోమక్క, జానకి, ఈరమ్మ పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, తిప్పన్న, గోపాల్, లక్ష్మణ్ణ, రామాంజనే యులు, వీరారెడ్డి, వీరేష్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్లను పరిష్కరించాలని శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముట్టడించారు. వారు చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఎంపీడీవో బంగారమ్మకు వినతిపత్రం అందజేశారు. అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ నాయకులు పాల్గొన్నారు.
ఆలూరు రూరల్: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో సీఎం జగన్ నిర్లక్ష్యం వీడాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కేపీ నారాయణ స్వామి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తాలూకా కార్యదర్శి జయశ్రీ అన్నారు. శుక్రవారం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరుకుంది. జాతీయ రహదారిపై అంగన్‌వాడీలు ఒంటి కాలిపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షాకీర్, కృష్ణ, డీవైఎఫ్‌ఐ నాయకులు మైన, గోవర్ధన్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు భారతి, బాలరంగమ్మ, లక్ష్మీ, సరస్వతి, సుజాత, ప్రభావతి, పుష్పవతి పాల్గొన్నారు.
మంత్రాలయం: మంత్రాలయం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు సీఐటీయూ, సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. మోకాళ్లపై నించుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దకడుబూరు: పెద్దకడబూరులోని ఎల్‌ఎల్‌సీ కెనాల్‌లో అంగన్‌వాడీలు జలదీక్ష చేపట్టారు. టీడీపీ, సీపీఎం మద్దతు తెలిపాయి. తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, సీపీఎం నాయకులు తిక్కన్న, పరమేష్, అంగన్‌వాడీ వర్కర్స్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 12:50 AM