రేషన్ పంపిణీలో వలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనాలి: కలెక్టర్
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:02 AM
రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ జి.సృజన సంబంధిత అధికా రులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 21: రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ జి.సృజన సంబంధిత అధికా రులను ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులు, మండల స్పెషల్ ఆఫీ సర్లు, ఎంపీడీవోలు తదితరులతో రీసర్వే, ఆడుదాం ఆంధ్ర, హౌసింగ్ అం శాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లు వెళ్లడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందువల్ల ఈ ప్రక్రియ సక్ర మంగా జరిగేలా పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. ఒక యాప్ ద్వారా లొకేషన్‌ను జియో ట్యాగింగ్ చేసి వలంటీర్ పరిధిలోని అం దరూ కార్డుదారులకు రేషన్ పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసు కుంటామన్నారు. వలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియ అమలయ్యేల చర్యలు తీసుకో వాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. వలంటీర్లు పాల్గొనకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌసింగ్ సంబంధించి మెగా కంప్లీసన్ డ్రైవ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో బీఎల్ నుంచి కంప్లీషన్ స్టేజికి రోజువారి లక్ష్యాలు సాధించడంలో పురోగతి శూన్యమని మద్దికెర, కోడు మూరు, కర్నూలు హౌసింగ్ ఇంజనీర్లను ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి 160 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయినందున తహ సీల్దార్ల లాగిన్ల నుంచి తన లాగిన్‌కి త్వరితగతిన పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - Dec 22 , 2023 | 12:02 AM