రైతులకు గిట్టుబాటు ధర ఏదీ?: బీసీ
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:21 AM
వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఏదీ? అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు.
బనగానపల్లె /సంజామల, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఏదీ? అని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. బనగానపల్లె మండలంలోని జిల్లెళ్ల, తిమ్మాపురం, సంజామల మండలంలోని ఆకుమళ్ల గ్రామంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌బీకేల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి గురించి ఎమ్మెల్యే రామిరెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఆకుమళ్ల గ్రామ పంచాయతీలో రూ.358 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. రైతులకు రూ.211 లక్షల రుణమాఫీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లెళ్లలో నాయకులు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ కాట్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, ఆంజనేయులు యాదవ్, ఆకుమళ్ల గ్రామంలో తిమ్మయ్య, ఏరాసి పుల్లారెడ్డి, రామగోవిందరెడ్డి, మూసాని చంద్రశేఖర్‌రెడ్డి, విష్ణుశేఖర్‌రెడ్డి, తెలుగు శ్రీనివాసులు, హుస్సేన్‌సా, మాబూహుస్సేన్, దాట్ల చంద్రశేఖర్‌రెడ్డి, నల్లగట్ట చంద్రశేఖర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మహమ్మద్ పాల్గొన్నారు.
బనగానపల్లె: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బనగానపల్లె కొండపేటలోని ఇక్బాల్, ఆటో యజమాని భాస్కర్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. బురానుద్దీర్, పూలకలాం తదిరులు ఉన్నారు.
కోవెలకుంట్ల: భీమునిపాడు గ్రామంలో గురువారం ఉదయం, కోవెలకుంట్లలో సాయంత్రం జరిగే ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొంటు న్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు అమదాల మద్దిలేటి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమాలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.
బనగానపల్లె: చంద్రబాబునాయుడును సీఎంగా చేసుకుుందాం.. రాష్ర్టాన్ని అభివృద్ది చేసుకుందాం అని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ పిలుపునిచ్చారు. బుధవారం బీసీ ఇందిరమ్మకు బనగానపల్లెలోని తెలుగుపేట, చక్రవర్తిటాకీస్, నాయక్‌వాడా ప్రాంతాల్లో బుధవారం ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ మేనిఫెస్టో గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేవలం వైసీపీ కార్యాకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
రుద్రవరం: టీడీపీతోనే రాష్ట్రాబివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని ఆలమూరు తిప్ప గ్రామంలో బుధవారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజల సమస్యల ప్రభుత్వం పట్లపట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ నాయకులు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనను స్వీపరుగా తొలగించి జీతం కూడా తినేశారని నాగమ్మ అనే మహిళ మాజీ మంత్రి దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్షుమ్మ, టీడీపీ నాయకులు బాచుపల్లె వెంకటనారాయణ, వేణుగోపాల్, రామసుబ్బారెడ్డి, రమణ, రఫి, ఖలీల్, రాజా, చంద్రశేఖర్, బాచుపల్లె వెంకటరమణ త దితరులుపాల్గొన్నారు.
చాగలమర్రి: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్లేవేముల గ్రామంలో బుధవారం రాత్రి బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురేష్, ప్రమోద్, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 12:21 AM