దళితుల సంక్షేమానికి టీడీపీ పెద్ద పీట
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:06 AM
దళితుల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తుందని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.
బేతంచెర్ల, డిసెంబరు 16: దళితుల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తుందని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధిష్టానం పార్టీకి అందించిన సేవలను గుర్తించి బలపాలపల్లి ఆంజనేయులు, సీతారామా పురం మద్దయ్యలకు జిల్లా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియమిం చడం హర్షణీయమని సుబ్బారెడ్డి అన్నారు. డోన్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పిక్కిలి ఆంజనేయులు, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా పుల్లూరు మద్దయ్యలను నియమించడం అభినందనీయమన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం వారిని సుబ్బారెడ్డితో పాటు మండల టీడీపీ కన్వీనర్ ఎల్లనాగయ్య శాలువలతో సత్కరించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, నాయకులు ఉన్నం ఎల్ల నాగయ్య, పోలూరు రాఘవరెడ్డి, ఉన్నం సుధాకర్, షేక్షావలి చౌదరి, తిరుమలేష్ చౌదరి, పోలూరు శ్రీనివాసరెడ్డి, జావాజి వెంకటేశ్వర్లు, జీవన్ చౌదరి, మేకల నాగరాజు, రూబెన్, సిమెంటునగర్ రాముడు, కౌన్సిలర్ రామగోపాల్, శ్రీపతి నాగరాజు, గోరంట్ల, కానాల అంజి పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:06 AM