స్పందన అర్జీలను పరిష్కరించండి
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:56 PM
స్పందన అర్జీలను పరిష్కరిం చాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 18: స్పందన అర్జీలను పరిష్కరిం చాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ స్వీక రించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీక రిం చిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ అందజేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుం డా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.మధు సూదన్ రావు, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగప్రసన్న లక్ష్మి, రమ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:56 PM