రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
ABN, Publish Date - Dec 14 , 2023 | 12:31 AM
నగరంలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిశ్చంద్రప్ప (55) అనే వృద్ధుడు మృతి చెందాడు.
కర్నూలు, డిసెంబరు 13: నగరంలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరిశ్చంద్రప్ప (55) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆస్పరి మండలం సిగిలి గ్రామా నికి చెందిన హరిశ్చంద్రప్ప కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఈ నెల 11న అమీలియో ఆసుపత్రికి వచ్చారు. ఆపరేషన్ ఇంకా చేయించు కోకముందు మంగళవారం రాత్రి బజ్జీల కోసం రోడ్డు దాటుతుండగా.. ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేసి జీవించే హరిశ్చంద్రప్ప భార్య గతంలో మృతి చెందింది. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
Updated Date - Dec 14 , 2023 | 12:31 AM