అదనపు బాధ్యతలను వ్యతిరేకిస్తున్నాం: ఫ్యాప్టో
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:59 PM
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలకు అంగన్‌వాడీ సెంటర్లను అటాచ్ చేయడం సరికాదని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్.గోకారి, సెక్రటరీ జనరల్ జి.తిమ్మప్పలు అన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 18: జిల్లాలో ప్రాథమిక పాఠశాలలకు అంగన్‌వాడీ సెంటర్లను అటాచ్ చేయడం సరికాదని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్.గోకారి, సెక్రటరీ జనరల్ జి.తిమ్మప్పలు అన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యను వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెలోకి వెళ్లారని, వారు గత మూడేళ్లుగా ప్రభుత్వానికి వారి సమస్యలను విన్నవిస్తున్నారని, కానీ ప్రభు త్వం వారి సమస్యలను తాత్సర్యం చేయడం ఫలితంగా అనివార్యంగా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాబట్టి అంగన్‌వాడీలో చదువుతున్న పిల్లలను ప్రాథమిక పాఠశాలలకు అటాచ్ చేసి ఆ పాఠశా లలో పిల్లలతోపాటు మిడ్ డే మీల్స్ పెట్టాలని చెప్పడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రిటర్న్ ఉత్తర్వులు ఇవ్వలేదని, అలాగే పిల్లకలు మిడ్ డే మీల్స్ పెట్టినందుకు అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి మీట్ కావాలో చెప్పలేదన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సంఘం నాయకులు రవికుమార్, నవీన్ పటేల్, మరియానందం, సేవా నాయక్, టీకే జనార్దన్, నారాయణ, శ్రీధర్ రాజ సాగర్, కృష్ణుడు, సుధాకర్, భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:59 PM