నిత్య పూజలు బంద్
ABN, First Publish Date - 2023-11-10T00:35:49+05:30
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ఏకాదశి సందర్భంగా గురువారం బృందావనానికి నిత్యం జరిగే అభిషేకాలు, అలంకరణ, నిత్య అన్నదానం, రథోత్సవాలు ఊరేగింపు, టెంకాయ కొట్టడం, పరిమళ ప్రసాదం బంద్ చేశారు.
మంత్రాలయం, నవంబరు 9: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో ఏకాదశి సందర్భంగా గురువారం బృందావనానికి నిత్యం జరిగే అభిషేకాలు, అలంకరణ, నిత్య అన్నదానం, రథోత్సవాలు ఊరేగింపు, టెంకాయ కొట్టడం, పరిమళ ప్రసాదం బంద్ చేశారు. నిజ బృందావనాన్ని భక్తులు దర్శించుకున్నారు. పండితుల ఆధ్వర్యంలో కేవలం బృందావనానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం నిర్వహించి మూలరాములకు పూజలు చేసి మహా మంగళ హారతులు ఇచ్చారు. అలంకరణ లేని రాఘవేంద్రస్వామి నిజ బృందావనాన్ని భక్తులు దర్శించుకున్నారు.
Updated Date - 2023-11-10T00:35:53+05:30 IST